మంచిర్యాల జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు పొందిన జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ను మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత సన్మానించారు. శుక్రవారం శ్రీనివాస్ ను సాయిని ప్రసాద్ నేత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కార్యదర్శిని ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రేండ్లగూడ ప్రజలకు శ్రీనివాస్ మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.