ఒక గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

69చూసినవారు
ఒక గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
కడెం ప్రాజెక్టులోని ఒక గేటు ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 698. 22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 4168 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో కాలువలకు 696, మిషన్ భగీరథకు 9, దిగువకు 3959 మొత్తం కలిపి 4751 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వారు వివరించారు.

సంబంధిత పోస్ట్