ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా సీఆర్టీల సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు భారీ ఎత్తున తరలివచ్చి సమ్మెలో పాల్గొన్నారు. తమకు పెండింగ్ వేతనాలు విడుదల చేసి మినిమం టైం స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మెతో చాలా పాఠశాలల్లో చదువు చెప్పేవారు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.