ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నెలకొన్న సమస్యలను తెలిపితే పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ప్రభుత్వం మంజూరు చేసిన బోరు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఒక్కొక్క బోరు చొప్పున వేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.