ఖానాపూర్ పట్టణంలోని మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ వెదురు పై ఉన్న ఆంక్షలతో మేదర కులస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి మేదర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో గౌరవ అధ్యక్షుడు బుచ్చన్న, అధ్యక్షుడు రాము, తదితరులు పాల్గొన్నారు.