ఎగువ కురుతున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి 254 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698. 175 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులు కుడి ఎడమ కాల్వలకు 888, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.