ఉద్యమాల బిడ్డను గెలిపించుకుందాం

80చూసినవారు
ఉద్యమాల బిడ్డను గెలిపించుకుందాం
ఉద్యమాల బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల నాయకులు కోరారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం వారు ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీ ఎన్నికల్లో ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణక్కను గెలిపించుకుందామని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్