స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

61చూసినవారు
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు
ఖానాపూర్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంద్రాగస్టును పురస్కరించుకొని గురువారం ఉదయం ఖానాపూర్ పట్టణంలో స్వర్ణకార సంఘం పట్టణ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్