లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు (వీడియో)
పశ్చిమ బెంగాల్ లోని బెల్గోరియాలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని ఓ యువతిపై.. ఒక యువకుడు పట్టపగలు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.