రేపు ఖానాపూర్ మండలంలో పవర్ కట్

68చూసినవారు
రేపు ఖానాపూర్ మండలంలో పవర్ కట్
ఖానాపూర్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలో సూర్జాపూర్ గ్రామంలో ఉన్న 33/11 కెవి మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్నివినియోగదారులు గమనించి సహకరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్