ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. పిడుగుపాటుతో ఏడుగురు మృతి

83చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. పిడుగుపాటుతో ఏడుగురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్‌-భటపరా జిల్లాలో ఆదివారం విషాద ఘటన జరిగింది. మొహతర గ్రామంలో కొందరు పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడింది. దీంతో పొలంలో పని చేస్తున్న వారంతా చెరువు గట్టుపైకి వెళ్లారు. అదే సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్