వార సంతలలో సమస్యలు పరిష్కరించాలి

68చూసినవారు
వార సంతలలో సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాలలో నిర్వహించే వార సంతలలో ఉన్న సమస్యలతో చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రాలు, గ్రామాలలో వార సంతలు జరుగుతుంటాయి. ఆ వార సంతలకు వివిధ ప్రాంతాల నుండి చిరు వ్యాపారులు, ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఆయా వార సంతలలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీసం మౌలిక సౌకర్యాలు కూడా లేవు. అన్ని వారసంతలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :