సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందుంటుంది

70చూసినవారు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు సంఘం ముందుంటుందని ఆ ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని పీఆర్టీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్టియు చొరవతో వేలాదిమంది ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు జరిగాయన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలు దాదాపు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్