హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ కలిశారు. మంగళవారం మధ్యాహ్నం మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్‌తో కలిసి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చినందుకు సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.