నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ లోకం సందీప్ తెలిపారు. మహారాష్ట్ర నుండి ఎంహెచ్ 19ఎక్స్ 6500 నంబర్ వాహనంలో తానూర్ వైపు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి చర్యల కొరకు తహశీల్దార్ లింగ మూర్తికి అప్పగించించినట్లు తెలిపారు.