రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వివిధ పార్టీ నాయకులతో డిఎల్పిఓ సుదర్శన్ పాటిల్ బన్వత్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఓటర్ జాబితా పై అందరూ సవరణలు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే చిరునామాలు మారిన ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే ఫారం 6, 8 ద్వారా సరిచేసుకోవాలని వెల్లడించారు.