మత సామరస్యానికి ప్రతీకగా అన్నదానం

66చూసినవారు
మత సామరస్యానికి ప్రతీకగా అన్నదానం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జై హనుమాన్ యూత్ గణేష్ మండలి వద్ద ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ముధోల్ మండలం చింత కుంట గ్రామానికి చెందిన బాబా(ముస్లిం) గణేష్ ఉత్సవాల్లో భాగంగా తన సొంత డబ్బులతో అన్నదానం చేశారు. మండలి నిర్వాహకులు సభ్యులు అతనికి శాలువాతో సన్మానం చేసి అభినందించారు. కుల మతాలకు అతీతంగా ఆయన చేసిన పనికి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్