అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా భైంసా ఏరియా ఆసుపత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో ఏఎస్పీ పాల్గొని రక్తదానం చేశారు. ఏఎస్పీతో పాటు మరో 50 మంది పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. పోలీసు అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.