భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శనివారం ప్రైవేటు ధర రూ. 7, 000 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శుక్రవారం ధరలతో పోలిస్తే ప్రైవేటులో ఎలాంటి మార్పు లేదన్నారు. శనివారం సెలవు దినం కావడంతో సీసీఐ పత్తి కొనుగోళ్లు ఉండవని తెలిపారు. కనీస మద్దతు ధర 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.