భైంసా మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మార్కెట్ యార్డు ఆవరణలో నూతన కమిటీతో మార్కెట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట చైర్మన్గా అనంద్ రావు పటేల్ ప్రమాణ స్వీకారం చేయగా, తరువాత వైస్ చైర్మన్గా ఫరూక్ హైమద్ తరువాత డైరెక్టర్లు ప్రమాణం చేశారు. నూతన చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని, అందుకు నాయకులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.