భైంసాకు చెందిన విద్యార్థి నవదీప్(16) హైదరాబాద్లో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం నవదీప్ రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సీఓఈ లో సీటు రావడంతో ఇంటర్ చేరాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ లోని తన సోదరుడి వద్దకు వెళ్లాడు. అక్కడ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదని తెలిపారు.