ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ముధోల్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యంలో భైంసాలోని నరసింహ నగర్ బుద్ధ విహార్ లో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ అధ్యక్షుడు భీమ్రావు డోంగ్రీ మాట్లాడుతూ ఈనెల 11న చలో ఢిల్లీ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మాల సోదరులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ అజాద్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు.