రాత్రి కురిసిన భారీ వర్షానికి బాసర మండల కేంద్రంలోని లబ్ది గ్రామంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు చేరి పలు కాలనీలు చెరువును తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే కాలనిలలో నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.