డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గురువారం మహారాష్ట్రలోని నాయగావ్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాజేష్ సంబాజీ తరపున ప్రచార పర్వాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రతనెల్లి, బాలాపూర్, గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 400 హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారన్నారు.