కుంటాల మండలంలోని ప్రాథమిక పాఠశాల కల్లూరులో విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు వారి ఇంటి వద్ద సిద్ధం చేసుకుని వచ్చిన వివిధ రకాలైన వంటకాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమం వల్ల పౌష్టికాహారం జంక్ ఫుడ్ మధ్య భేదాలు తెలుసుకొని విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే అలవాటు చేసుకుంటారని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.