నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని మొక్కు తీర్చుకున్నారు. అమ్మవారికి అభిషేకం, అలంకరణ, పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.