బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే దేవీ (దసరా) నవరాత్రుల వేడుకలు వచ్చేనెల 3 నుండి 12 వరకు నిర్వహించనున్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బిసి వెల్ఫేర్ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు.