బాసర ఆలయంలో భక్తులకు తప్పని తిప్పలు

74చూసినవారు
బాసర సరస్వతి అమ్మవారి చెంత భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 1, 000, 150 రూపాయల అక్షరాభ్యాస టికెట్ కౌంటర్ల ముందు భారీగా వర్షపు నీళ్లు నీరు నిలిచింది. ఆలయంలోని గర్భగుడి ముందర ప్రాంగణంలో రేకులకు చిల్లులు పడడంతో ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరుతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్