కుబీర్ మండలకేంద్రంలో భక్తులు నాగుల పంచమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి విఠళేశ్వర ఆలయంలోని పుట్టలో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. అనంతరం పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కుబీర్ మండలంతో పాటు ఆయా గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.