భైంసా మండల చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు గణపతి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే అని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు పాఠాలు బోధించారు.