భైంసా పట్టణంలోని శివాజీనగర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం భైంసా-నిర్మల్ రహదారి పక్కన శివాజీనగర్ లో సద్దాం అనే వ్యక్తి పీడీ ఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచాడన్న సమాచారం మేరకు తనిఖీ చేసి నట్లు తెలిపారు. 17 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.