తానూర్ మండలం భోరిగాం గ్రామంలో గత ఏడు రోజులుగా కొనసాగుతున్న మహాలక్ష్మీ అమ్మవారి జాతర వేడుకలు శనివారం ముగిసాయి. జాతర సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కుస్తీపోటీలు అలరించాయి. పోటీల్లో తెలంగాణ మహారాష్ట్ర నుండి మల్లయోధులు పోటీలో తలపడ్డారు. కుస్తీ పోటీల్లో తలబడి విజయం సాధించిన మల్లయోధులకు బహుమతులను అందజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.