కష్ట పడి పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అనుచరులు అన్నారు. శనివారం భైంసాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం నామినేట్ పదవుల్లో డైరెక్టర్లుగా నిన్న మొన్న కాంగ్రెస్ లో చేరిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధిష్టానానికి పిర్యాదు చేస్తామని వెల్లడించారు.