బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

57చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ కాలనీలో పురాతన హనుమాన్ ఆలయం వద్ద చెట్టు నరికివేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు మంగళవారం ఫిర్యాదుచేశారు. గాజులపేటలో పురాతన హనుమాన్ ఆలయం ఉందని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం సమీపంలో గల రావి చెట్టును నరికివేసి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్