నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. ఇవాళ థియేటర్లలో విడుదల కాగా.. మూవీ చూసిన వారు రివ్యూ ఇస్తున్నారు. మూవీ ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ ఓకే అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. నితిన్ హిట్ కొట్టాడని, సినిమా స్టోరీ కొత్తగా ఏమీ లేదని, కామెడీ వైజ్ చూస్తే సీన్లతో ఒక ఫ్లోలో వెళ్లిపోతుందంటున్నారు. వార్నర్ యాక్టింగ్ ఇరగదీశాడని, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంటుందని చెబుతున్నారు.