ఆలూర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

1904చూసినవారు
ఆలూర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2007-2008 బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఏకమయ్యారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి 40 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను పంచుకున్నారు. పాఠాలు బోధించిన గురువులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్