ఆర్మూర్ పట్టణంలో ఉన్న జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొర్త దేవేందర్ మాట్లాడుతూ. ప్రతి శనివారం ఆలయంలో అన్నదాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, అన్నదాతలు ఏలేటి అమృతరామ్ రెడ్డి దంపతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.