ఆర్మూర్ పట్టణం మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులంతా మున్సిపల్ ఆఫీస్ వద్ద బతుకమ్మలు పేర్చి ఆటపాటలాడారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.