నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్న ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ లోకి భారీ వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎల్ కెపాసిటీ 1299. 6 కాగా 1296. 11 స్థాయికి చేరింది. నీటి పారుదల శాఖ అధికారులు ఒక గేటును ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. రెండు రోజుల్లో రిజర్వాయర్ లోకి 950 క్యూసెక్కుల నీరు రాగా, 500 క్యూసె క్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.