కోమన్ పల్లి ఎస్సెస్సీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు అందజేత

83చూసినవారు
కోమన్ పల్లి ఎస్సెస్సీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు అందజేత
ఆర్మూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాలలో ఆర్మూర్ పీఆర్టీయూ మండల అధ్యక్షులు ఇట్టెం గోపాల్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేలు, పెన్నులు గురువారం అందజేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నారు. పీఆర్టీయూ అధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ మన పాఠశాల నుండి 10/10 సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్