నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. శుక్రవారం పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.