బాసర జీఎస్ గార్డెన్ లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముథోల్ నియోజకవర్గ నాయకులు గురువారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ ఉదయం 10: 30 గంటలకు మంత్రి బాసరకు రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.