తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఎమ్మెల్యే

59చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని గురువారం రామన్నపేట మధ్యలో ఆర్అండ్బి రోడ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వెంటనే రాకపోకలు పునరుద్ధరించడానికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని.. శాశ్వత రోడ్డు పరిష్కారం కోసం ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.