నందిపేట్: నూత్ పల్లిలో రాజరాజేశ్వర స్వామి జాతర ప్రారంభం

57చూసినవారు
నందిపేట్: నూత్ పల్లిలో రాజరాజేశ్వర స్వామి జాతర ప్రారంభం
నందిపేట్ మండలంలోని నూత్ పల్లిలో రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర అట్టహాసంగా ప్రారంభం అయింది. ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ జాతరలో బుధవారం రోజు స్వామి వారి ఊరేగింపు మరియు కళ్యాణం జరిపించారు. గురువారం రోజు బోనాలు సమర్పించుకున్నారు. ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు తరలివస్తారు. ఐదు రోజుల పాటు జరగనున్న జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్