నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన (ఆలూర్) భీమన్న దేవుని ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఆదివాసి నాయక్ పోడ్ తెగల ఆధ్వర్యంలో ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆదివాసి తెగల ప్రజలు తరలివస్తారు.