వేల్పూర్ మండలనికి నూతన మండల విద్యాశాఖ అధికారిగా నియమితులైన టీ రేణుక ను వేల్పూర్ మండలం పిఆర్టియు పక్షాన స్వాగతం తెలుపుతూ బుధవారం శాలువతో సన్మానం చేశారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన జి వనజకు సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ పిఆర్టియు మండల అధ్యక్షులు బోడ దేవానందం, ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు సన్మానించారు.