బుధవారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా అదుర్స్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్ నుండి అసెంబ్లీ వరకు ఆటోలో బయలుదేరిన మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఆటో డ్రైవర్ లతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.