రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

58చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన బొల్లి సన్ని(19), అతని స్నేహితులు ఒకే బైక్ పై జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లి వస్తుండగా లక్ష్మి కాలువ వంతెన వద్ద రోడ్డు డివైడర్ ను బైక్ వేగంగా ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో సన్ని, గోపిలకు తీవ్ర గాయాలు కాగా, అరవింద్ కు నడుము భాగంలో బలమైన గాయం కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సన్ని శుక్రవారం ఉదయం మృతి చెందగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు అని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్