పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన భీమ్గల్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రింషా మహిన్(16) రోజు మాదిరి బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాలికకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.