ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ 4వ సంవత్సర వార్షికోత్సవం

75చూసినవారు
ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ 4వ సంవత్సర వార్షికోత్సవం
రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి 4వ వార్షికోత్సవ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలతో ఊరేగింపుగా మందిరానికి విచ్చేసి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆమ్మవారి ఆశిస్సులు ఎల్లప్పుడు గ్రామ ప్రజలందరిపై ఉండాలని మొక్కులు మొక్కుకున్నారు. గంగాధర్, భూమన్న, వైస్ ఎంపీపీ యోగేష్, అనిల్, రమేష్, సాయి, శివకుమార్, రాజు, రాము, గంగా కిషన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్